కారులో చెలరేగిన మంటలు..ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్

Article

గుంటూరు: మంగళగిరి నేషనల్ హైవే‌ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై షిఫ్ట్ డిజైర్ కారు అగ్నికి ఆహుతయింది. విజయవాడ వెళ్తున్న మారుతీ కారు.. గుంటూరు సమీపంలోకి వెళ్లగానే ఒక్కసారిగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఐదుగురు ప్రయాణికులు కారు నుంచి దిగిపోయారు. అయితే కారు డ్రైవర్ కాలుకి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కేసు నమోదు చేసిన పోలీసులు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందన్నారు.

Prev 28 మంది ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారులను అరెస్ట్
Next పైసా ఖర్చు లేకుండా వైద్యఖర్చులు భరిస్తాం.. చంద్రబాబు హామీ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.