భారీగా పెరిగిన విదేశీ మారకం నిల్వలు

Article

విదేశీ మారకం నిల్వలు భారీగా పెరిగాయి. గడిచిన కొన్ని నెలలుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న ఫారెక్స్ నిల్వలు ఈ నెల 4తో ముగిసిన వారంలో ఏకంగా 2.68 బిలియన్ డాలర్లు పెరిగి 396.084 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కరెన్సీ రూపంలో ఆస్తులు పెరుగడం, పసిడి హోల్డింగ్స్ అధికమవడం వల్లనే విదేశీ మారకం నిల్వల్లో గణనీయ వృద్ధి నమోదైందని రిజర్వు బ్యాంక్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అంతక్రితం వారంలో 116.4 మిలియన్ డాలర్లు మాత్రమే పెరిగి 393.404 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వీటిలో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ మరో 2.215 బిలియన్ డాలర్లు ఎగబాకి 370.292 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్ 13, 2018న రిజర్వులు రికార్డు స్థాయి 426.028 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ భారీగా పతనమవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో రిజర్వు బ్యాంక్ 34 బిలియన్ డాలర్ల మేర నష్టపోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో పసిడి రిజర్వులు 465.5 మిలియన్ డాలర్లు పెరిగి 21,689 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. జూన్ 2018తో ముగిసిన ఏడాదికాలంలో ఆర్బీఐ మరో 8.46 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలను పెంచుకున్నది. దీంతో ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ వద్ద 566.23 టన్నుల పసిడి ఉన్నాయి.

Prev ఆర్టీసీ బస్సు బోల్తా…
Next జనసేన పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.