అరుణ్ జైట్లీ కెరీర్‌లో మైలు రాళ్లు: జీఎస్టీ, నోట్ల రద్దు

అరుణ్ జైట్లీ కెరీర్‌లో మైలు రాళ్లు: జీఎస్టీ, నోట్ల రద్దు

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్, శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న బీజేపీ సీనియర్ నేత.. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుమారు మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో పదవులను అలంకరించారు. అయితే, భారతదేశ చరిత్రలో రెండు అత్యంత కీలక ఆర్థిక సంస్కరణలు ఆయన ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడే అమలు చేయడం అరుణ్ జైట్లీ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిపోయాయి. ఆ రెండు కీలక సంస్కరణల్లో మొదటిది నోట్ల రద్దు.

2016 నవంబర్ 8న రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేశారు. ఆ సమయంలో అరుణ్ జైట్లీనే ఆర్థికమంత్రి. దీని వల్ల దేశానికి జరిగే మేలు గురించి, డిజిటల్ ఎకానమీ వైపు దేశం పరుగులు పెడుతుందని ఆయన విశ్వసించారు. దీంతో పాటు జీఎస్టీ కూడా ఆయన ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడే అమల్లోకి వచ్చింది. 2017 జూలై 1న అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రాలకు ఉన్న సందేహాలను నివృత్తి చేసి వాటిని ఒక్కతాటి మీదకు తీసుకురావడంలో అరుణ్ జైట్లీ కీలకపాత్ర పోషించారు.

more updates »