యాక్టింగ్‌ స్కూల్‌ లో యువతులను వేధిస్తున్న ట్రైనీ

యాక్టింగ్‌ స్కూల్‌ లో యువతులను వేధిస్తున్న ట్రైనీ
హైదరాబాద్‌ : యాక్టింగ్‌ పేరుతో అమ్మాయిలను వేధిస్తోన్న ఓ వ్యక్తి భాగోతం బుధవారం వెలుగు చూసింది. హిమాయత్‌నగర్‌ లో యాక్టింగ్‌ స్కూల్‌ నడుపుతున్న వినయ్‌ అనే వ్యక్తి నటన నేర్చుకోవడానికి వచ్చే అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తుండేవాడు. అది కాస్తా శృతి మించడంతో.. విసుగెత్తిన అమ్మాయిలంతా షీ టీం ను ఆశ్రయించారు. ట్రైనీ ఆటకట్టించాల్సిన షీ టీం నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఉచిత సలహా ఇచ్చింది. దీంతో చేసేదేమీ లేక బాధితులంతా మీడియాను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. బాధితుల పక్షంగా నిలబడి పోరాటం చేస్తామని, ట్రైనీ పై తగిన చర్యలు తీసుకునే విధంగా పోరాడతామని మహిళా సంఘాలు పేర్కొన్నాయి.
more updates »