16 లక్షల విలువ చేసే గుట్కాలు టాస్క్ ఫోర్స్ పోలీసుల స్వాధీనం

Article

వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి వెస్ట్ జోన్ లో రూ.16 లక్షల విలువ చేసే ప్రభుత్వ నిషేధిత గుట్కాలతో పాటు 72 వేల నగదును టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనగామ జిల్లా నర్మెట మండలం నుంచి కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు నిషేధిత పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు సరఫరా చేస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది బొతెలబర్రె గ్రామంలోని సిద్దం రాజు ఇంటిపై దాడులు నిర్వహించారు.

సిద్దం రాజును ఆదుపులోకి తీసుకోని విచారించగా..హైదరాబాద్ కు చెందిన రాజు, శ్రీనువాస్, లోరేల్, లక్ష్మణ్ కలిసి బీదర్ నుంచి గుట్కాలు సరఫరా చేస్తున్నారని సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు నర్మెట శివారు ప్రాంతంలో ఇవాళ ఉదయం తనిఖీలు నిర్వహిస్తుండగా నలుగురు నిందితులు రెండు కార్లు, బొలెరో వాహనంలో గుట్కాలు సరఫరా చేస్తూ పట్టుబడ్డారని సీపీ రవీందర్ పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి 40 గుట్కా బ్యాగ్ తో పాటు,72 వేల నగదును, వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టాస్క్ బృందాన్ని సీపీ అభినందించారు.

Prev ఇక రాష్ట్రమంతా వాహనాలకు ఒకే సిరీస్
Next పైసా ఖర్చు లేకుండా వైద్యఖర్చులు భరిస్తాం.. చంద్రబాబు హామీ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.