విజయవాడ హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్

Article

సంక్రాంతి సెలవులు రావడంతో పట్నంవాసులు పల్లెబాట పట్టారు. పిల్లపాపలతో ఊళ్లకు బయలుదేరిన వాహనాలతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరాయి. దాదాపు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. తెల్లవారుజాము నుంచి పొగమంచు కమ్మేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురువుతోంది. వరంగల్ హైవే పై ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులుతీరాయి. దీంతో దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. తాకిడిని తట్టుకునేందుకు టోల్‌ప్లాజా అధికారులు అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటుచేశారు. అయినా ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడంలేదు.

Prev అన్నిరకాల పింఛన్లు రెట్టింపు
Next పైసా ఖర్చు లేకుండా వైద్యఖర్చులు భరిస్తాం.. చంద్రబాబు హామీ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.