టీడీపీ నేతలకు హైకోర్టు నోటీసులు

Article
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు, సీనియర్‌ నేత నాగుల్‌ మీరాలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, రవాణాశాఖ కమిషనర్ బాల సుబ్రహ్మణ్యం పై దౌర్జన్యం కేసులో వీరికి నోటీసులిచ్చింది. 2017లో రవాణా శాఖ కమిషనర్‌పై దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ జరిగిన వివాదాన్ని సుమోటోగా స్వీకరించి హైకోర్టు విచారణ చేసింది. ఇవాళ కేనును విచారించిన న్యాయస్థానం.. జూన్‌ నెలకు వాయిదా వేసింది.
Prev పొరపాటున బిజెపికి ఓటువేసి వేలు నరుక్కున్న యువకుడు
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.