ఉత్తరప్రదేశ్‌లో పట్టాలు తప్పిన పూర్వ ఎక్స్‌ప్రెస్

Article
హౌరా-న్యూఢిల్లీ మధ్య నడిచే పూర్వ ఎక్స్‌ప్రెస్ ఈ తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మొత్తం 900 మంది ప్రయాణికులతో న్యూఢిల్లీ వెళ్తున్న రైలులోని ఎస్8, ఎస్9, బి1-బి5, హెచ్ 1, ఎ1, ఎ2, ప్యాంట్రీ కారు, ఎస్ఎల్ఆర్ కోచ్ పట్టాలు తప్పినట్టు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి దాటాక 12:50 గంటలకు రూమా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగినట్టు పేర్కొన్నారు. సహాయ కార్యక్రమాలు జరుగుతుండడంతో ఆ మార్గం గుండా ప్రయాణించే 13 రైళ్లను రద్దు చేశారు.
Prev అమెరికాలో తెలుగు విద్యార్థికి పదేళ్ల జైలు శిక్ష
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.