చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలిఅంటే ఏదో అద్భుతం జరగాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

Article

చంద్రబాబు నాయుడు ఈరోజు పొజిషన్ ని బట్టి చూస్తే, ఏదో అద్భుతం జరిగితేనే ఆయన మళ్లీ అధికారంలోకి వస్తారని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఆ అద్భుతం ఏంటన్నది తనకు కూడా తెలియదని, అయితే, అద్భుతాలు చేసే సమర్ధత, దాని కోసం పోరాడే తత్వం చంద్రబాబుకు వున్నాయని అన్నారు.

ఈరోజున పబ్లిక్ లో చంద్రబాబుకి అంత అనుకూలంగా లేదని, అదే, జగన్ కు బాగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే, వచ్చే మూడు నెలల్లో ఏదైనా జరగొచ్చని, వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను కేటాయించడం, టికెట్లు లభించని వారి ప్రభావం, వాళ్లు మీడియా ముందు ఏం చెబుతారన్న అంశాలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని, అందుకే, చివరి నిమిషం వరకూ చాలా జాగ్రత్తగా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

Prev రాహుల్ గాంధీ మరో సంచలన నిర్ణయం
Next తాను పెంచుకున్న మొసలికే ఆహారమైన మహిళా సైంటిస్ట్‌
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.