వైరల్ వీడియో: బిజీ రోడ్డులో నాలుగు సింహాలు

Article

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో తెగ వైరల్ గా మారింది. ఇందులో నాలుగు పూర్తిగా పెరిగిన ఆఫ్రికా సింహాలు రోడ్డుపై నడుస్తున్నాయి. అదీ అత్యంత రద్దీగా ఉన్న రోడ్డులో. వెనక కార్లు నెమ్మదిగా ఫాలో అవుతున్నా నదురు లేదు బెదురు లేదు. చూస్తేనే బెంబేలెత్తిస్తున్న ఈ వీడియోని మొదట ఓ ఫేస్ బుక్ పేజీలో షేర్ చేశారు. ‘లయన్స్ ఆఫ్ క్రూగర్ పార్క్ అండ్ సాబీ శాండ్’ అనే ఫేస్ బుక్ పేజీలో మొదటిసారి ఈ వీడియో కనిపించింది మొదలు ఇప్పటి వరకు 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక షాకైనవాళ్లు పెట్టిన టన్నుల కొద్దీ కామెంట్లు సరేసరి.

దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్ లో ఈ వీడియోని తీశారు. కేవలం అరనిమిషం నిడివి మాత్రమే ఉన్న ఈ వీడియోలో నాలుగు ఆఫ్రికా సింహాలు బిజీ రోడ్డుపై రాజసంగా నడుచుకుంటూ వెళ్తున్నాయి. మృగరాజులకు చిరాకు కలిగిస్తే ఏం చిక్కొస్తుందోనని ఎన్నో కార్లు స్లోగా ఆ సింహాల వెంట నడిచాయి. రెండు వారాల క్రితం ఆన్ లైన్ లో షేర్ చేసింది మొదలు ఈ వీడియోకి ఇప్పటివరకు 34,000 కి పైగా షేర్లు, లక్షలాది కామెంట్లు వస్తూనే ఉన్నాయి.


Prev విజయవాడ హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్
Next పైసా ఖర్చు లేకుండా వైద్యఖర్చులు భరిస్తాం.. చంద్రబాబు హామీ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.