ఇండిగో ఆఫర్: ఈరోజు, రేపు రూ. 999కే విమానం టికెట్

Article
ఈ వేసవిలో రూ. 999కే విమానం టికెట్ లను అందించాలని నిర్ణయించామని దేశవాళీ విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. ఈ ఆఫర్ 16వ తేదీ వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 28లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని సంస్థ తెలిపింది. ఇండియాలోని 53 రూట్లతో పాటు 17 అంతర్జాతీయ రూట్లకూ ఆఫర్ ఉంటుందని సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వెల్లడించారు. ఈ సెలవుల్లో అధిక లగేజీతో వెళ్లేవారికి అదనపు చార్జీలపై 30 శాతం రాయితీని అందించనున్నామని తెలిపారు.
Prev విదేశీ బ్యాంకుల్లో నాకు డబ్బుంటే చూపించండి: మోదీ సవాల్
Next పశ్చిమ బెంగాల్‌లో రీ పోలింగ్‌ కు ఆదేశం
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.