ఏపిలో ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల

Article

అమరావతి: ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మీ విడుదల చేశారు. ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. తొలిసారిగా ఇంటర్ ఫలితాలు గ్రేడింగ్ విధానంలో విడుదల చేశారు. ఈసారి కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. ఫస్టియర్ ఫలితాల్లో 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 72శాతంతో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్‌లో 81శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో చిత్తూరు జిల్లా నిలిచింది. బాలికలు 75శాతం, బాలురు 68శాతం ఉత్తీర్ణత సాధించారు. మే 14 అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ జరగనుంది. ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 24న చివరి తేదీ అని తెలిపారు.

ఫలితాలను కింది వెబ్‌సైట్లలో చూడవచ్చు
 • http//results.apcfss.in
 • http//bieap.gov.in
 • http//jnanabhumi.ap.gov.in
 • Prev నూటికి నూరు శాతం మళ్లీ టిడిపినే గెలుస్తుంది: చంద్రబాబు
  Next మద్యం మత్తులో అధికారులు
   

  0 Comments

  Write a comment ...
  Post comment
  Cancel
   Please submit your comments.