రాహుల్ గాంధీ వ్యూహం ఫలించేనా?

రాహుల్ గాంధీ చిల్లర గా ప్రవర్తించటం ఇంకా మానుకోలేదు. ఈరోజు లోక్ సభలో వచ్చిన అవకాశాన్ని ఉపగోయించుకోలేకపోవటం అందరం చూసాం. రఫెల్ ఒప్పందంపై లోక్ సభలో చర్చకు పట్టుపట్టి ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోలేక పోవటం తన నాయకత్వ లోపమనే చెప్పాలి. ముందుగా టేప్ ప్లే చేయాలని చూసి అందుకు ఒప్పుకోక పొతే దాని సంభాషణని చదవబోయాడు. అందుకు స్పీకర్ అభ్యంతరం చెప్పింది. ముందుగా ఆటేప్ నిజమయినదేనని హామీ ఇవ్వమంటే చల్లగా జారుకున్నసంగతి చూసాం. చివరకు పాత ఆరోపణలనే తిరిగి తిరిగి చేయటం అందులోని డొల్లతనాన్ని చెప్పకనే చెప్పింది. ఇంత అభాసుపాలయిన తర్వాత కూడా ఆ విషయాన్ని అంతటితో వదిలేయకుండా పత్రికా సమావేశంలో దానిని బయటపెట్టటం ఏవిధమయిన రాజనీతి? నువ్వు దాని ఫై హామీ ఇవ్వటానికి జంకటం దేశమంతా చూసిన తర్వాత బయట విడుదల చేయటం ఒక స్థాయిగల నాయకుడు చేయాల్సిన పని కాదు. ఇది ఎలావుందంటే ప్రతిరోజూ సాంఘిక మాధ్యమాల్లో ఎన్నో fake వార్తలు వస్తూనే ఉంటాయి. వాటిని పదిమందికి పంపించినట్లే వుంది. ఇది చిల్లర పని కాక ఏమిటి? ఒక బాధ్యతగల నాయకుడు చేయాల్సిన పనికాదు.

ఈ ఆదుర్దా అంతా చూస్తుంటే ఎక్కడో నిస్పృహలో చేస్తున్న పనులు లాగా వున్నాయి. ఓవైపు ఆగస్తా వెస్ట్ లాండులో తమ పేర్లు బయటికి రావటం , రెండోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో ఎలా బయటకు రావాలో తెలియక ఏదోవిధంగా మోడీని అవినీతి పరుడని ముద్రవేయటానికి తాపత్రయపడుతున్నట్లు తెలుస్తుంది. మోడీ దొంగ, అవినీతిపరుడు అని ప్రత్యక్షంగా ఆరోపించడం ఏవిధంగానూ ప్రజలు స్వీకరించే పరిస్థితిలో లేరు అని గమనించాలి. దానికి బదులుగా రాహుల్ గాంధీ , సోనియా గాంధీ లు నేషనల్ హెరాల్డ్ కేసులో 1000 కోట్ల ఆస్తిని స్వంతం చేసుకోవటానికి ప్రయత్నించారని దాఖలైన పిటిషన్లపై కోర్టు ప్రాధమికంగా ఆమోదించి విచారణ చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. రాహుల్ గాంధీ మోడీపై రోజూ కోడైకూసినా నమ్మని ప్రజలు గాంధీ కుటుంబం ఫై అదే స్థాయిలో మోడీ ప్రచారం చేస్తే నమ్మే పరిస్థితివుందని గమనించాలి. నిర్దిష్టమయిన సాక్ష్యం లేకుండా ఆరోపణలు చేస్తే తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికే ఈ ఆరోపణల్ని చేస్తున్నాడని ప్రజలు అనుకునే ప్రమాదముందని గమనించాలి.

రాబోయే ఎన్నికలు ఎలావుండబోతున్నాయో దీన్నిబట్టి అర్థంచేసుకోవాలి. వ్యక్తి నిజాయితీ వచ్చే ఎన్నికల్లో అజెండా అయితే నష్టపోయేది రాహుల్ గాంధీయేనని ఎంత త్వరగా గమనించి వ్యూహం మార్చుకుంటే అంత మంచిది. లేకపోతే మోడినెత్తిన పాలుపోసినట్లేననుకోవాలి. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ వ్యూహం ఎలా పరిణమిస్తుందో

Prev చంద్రబాబు.. ప్రతిపైసాకు లెక్కచెప్పాలి: నరేంద్ర మోడీ
Next భారీగా రైతుల నామినేషన్లు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.