‘ఆమెగా మారిన అతను’...హైదరాబాద్ పోలీసులకు వింత సమస్య...

Article

హైదరాబాద్ పోలీసులకు ఓ వింత సమస్య ఎదురైంది. ఓ కేసులో దోషులను అరెస్ట్ చేశామని సంతోషించే లోపు... ఆ వ్యక్తి ఆడా? లేక మగా? తేల్చుకోలేక తికమక పడుతున్నారు పోలీసులు. హైదరాబాద్‌లోని కుషాయిగూడ కార్ల ఛీటింగ్ కేసులో సరికొత్త ట్విస్ట్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కార్ల ఛీటింగ్ కేసులో ఈ నెల 3వ తేదీన పోతులయ్య, సయ్యద్ సిరాజ్ హుస్సేన్‌లను అరెస్ట్ చేశారు కుషాయిగూడ పోలీసులు. అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన సయ్యద్ సిరాజ్ హుస్సేన్... ఆడా? లేక మగా? అనే విషయం తెలియక గందరగోళంలో పడ్డారు పోలీసులు. మొదట సిరాజ్‌ను మగాడిగా గుర్తించి... చర్యలు చేపట్టారు పోలీసులు. అయితే సిరాజ్ హుస్సేన్... కేసు నమోదుచేసే సమయంలో తనను మహిళగా చెప్పాడంతో షాక్‌కు గురయ్యారు పోలీసులు.

మొదట సయ్యద్ సిరాజ్ హుస్సేన్ పురుషుడే అయితే... మూడు సంవత్సరాల క్రితం ముంబయిలో లింగ మార్పిడి చేయించుకుని స్త్రీగా మారినట్టు పోలీసులకు తెలిపింది. ఇప్పుడు తన పేరు షాబినా అస్మి అని తెలిపింది ఆమెగా మారిన అతను. దాంతో ఈ కేసులో ఎలా ముందుకు పోవాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు పోలీసులు. ‘420 చెప్పేది నమ్మలేం... మీరే క్లారిటీ ఇవ్వండి’ అంటూ ఫోరెన్సిక్ డాక్టర్లను వేడుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా ఫతేపూర్ గ్రామానికి చెందిన అమ్మాయిగా తనను తాను చెప్పుకున్న సయ్యద్ సిరాజ్ హుస్సేన్ ఉరఫ్ షాబినా అస్మికి... లింగ నిర్ధారణ పరీక్షలు జరిపి నివేదిక అందివ్వాల్సిందిగా గాంధీ ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ విభాగానికి లేఖ రాశారు పోలీసులు. ఈ నివేదిక అందిన తర్వాత ఎఫ్ఐఆర్‌లో జెండర్ కాలమ్ నింపుతామని తెలిపారు.

Prev సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా ప్రయాణికుల రద్దీ
Next జగన్ సర్కారుకు చిల్లిగవ్వ కూడా అప్పు పుట్టదు: యనమల
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.