శ్రీలంకలో ఆత్మాహూతి దాడులు మా పనే: ఐసిస్ ప్రకటన

Article
ఈస్టర్ పండగ రోజున శ్రీలంక రాజధాని కొలంబో బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన విషాద ఘటన తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది. ఈ మేరకు ఐసిస్ కు చెందిన అమాక్ న్యూస్ ఏజెన్సీ ఓ ప్రకటన చేసింది. కొలంబోలోని మూడు చర్చిలు, మూడు స్టార్ హోటల్స్ లో బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని పేర్కొంది. కాగా, కొలంబోలో పలుచోట్ల సంభవించిన పేలుళ్లలో 310 మంది వరకు మృతి చెందారు. ఐదు వందల మందికి పైగా గాయపడ్డారు.
Prev పోలింగ్ కేంద్రం సమీపంలో నాటు బాంబులను విసిరిన దుండగులు
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.