అమలాపురంలో వ్యాపారుల ఇళ్లపై ఐటీ దాడులు

Article
అమలాపురంలో పలువురు వ్యాపారుల ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేశారు. ఐటీ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రమేష్ ఆధ్వర్యంలో పలు బృందాలుగా విడిపోయిన అధికారులు సుమారు ఆరు చోట్ల సోదాలు చేశారు. పట్టణంలోని వడ్డీవ్యాపారి నిమ్మకాయల సత్యనారాయణ ఇంటితోపాటు రొయ్యల మేత దుకాణాల్లో సోదాలు చేపట్టారు. అల్లవరం మండలం కోడూరుపాడులో ఉన్న రొయ్యపిల్లల ఉత్పత్తి కేంద్రంలోనూ తనిఖీలు చేశారు. ఇదే పట్టణానికి చెందిన రియల్‌ఎస్టేట్ వ్యాపారి ఆదిబాబు, ఉప్పలగుప్త మండలం గోపవరం గ్రామంలోని ఆకుల చంటి ఇళ్లలోనూ ఐటీశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. గత నెలలో పలువురు రియల్‌ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లల్లో జరిగిన సోదాలకు ఇవి కొనసాగింపుగా జరుగుతున్నాయని సమాచారం. ఐటీ దాడుల నేపథ్యంలో పట్టణంలోని ఆక్వా రైతులతోపాటు వడ్డీ వ్యాపారులు హడలిపోతున్నారు.
Prev ఇంటర్‌ ఫలితాల వ్యవహారంపై దృష్టిపెట్టిన కేసీఆర్‌
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.