జగన్ అంటే నాకు భయం లేదు.. 6 నెలల తర్వాత నేనేంటో చూస్తారు!: జేసీ దివాకర్ రెడ్డి

జగన్ అంటే నాకు భయం లేదు.. 6 నెలల తర్వాత నేనేంటో చూస్తారు!: జేసీ దివాకర్ రెడ్డి

బీజేపీలో చేరాల్సిందిగా ఆ పార్టీ నేతలు తనను ఆహ్వానించారని టీడీపీ నేత, మాజీ లోక్ సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అయితే ఈ విషయంలో తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. జగన్మోహన్ రెడ్డిపై జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో జగన్ చాలా హుందాగా వ్యవహరించారంటూ కితాబిచ్చారు. పులివెందుల నుండి వచ్చిన జగన్ ఇంత హుందాగా వ్యవహరిస్తారని తాను అనుకోలేదని చెప్పటం పార్టీలో కలకలం రేగుతోంది.

ప్రత్యేకహోదా విషయాన్ని వదలనని చెప్పిన జగన్ ఢిల్లీకి వెళ్ళినపుడల్లా ప్రధానమంత్రికి నమస్కారం పెడుతూనే హోదా గురించి అడుగుతునే ఉంటానని చెప్పటం నూటికి నూరుపాళ్ళు నిజమే చెప్పారన్నారు. జగన్ కాంగ్రెస్ పార్టీలో నుండి బయటకు వెళ్ళాల్సింది కాదంటూ కుండబద్దలు కొట్టారు. జగన్ చెప్పిన మాటలు వాస్తవాలు గ్రహించే చెబుతున్నట్లు చెప్పారు.

అనంతపురంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు.జగన్ కు భయపడి ఆయన్ను పొగడటం లేదనీ, ఆయన తీరు నచ్చే ప్రశంసిస్తున్నానని జేసీ అన్నారు. తాను జగన్ కు భయపడుతున్నానో, లేదో 6 నెలల తర్వాత చూస్తారని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై పార్టీ అధినేత చంద్రబాబు సమీక్షించుకుంటారని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

more updates »