జగన్ లో వైఎస్ స్పష్టంగా కనిపిస్తున్నారు

Article

ఎవరూ సాధించలేనంతటి ఘన విజయాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో నమోదు చేసి వైఎస్ జగన్ ను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్టీఆర్ ఘన విజయాన్ని సాధించిన వేళ కూడా ఆయన ఇతర పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుని ముందుకు సాగారని, జగన్ మాత్రం ఒంటరిగా పోటీ చేశారని గుర్తు చేశారు.

నిన్న ఢిల్లీలో ప్రధానితో చర్చించి వచ్చిన తరువాత జగన్, మీడియాతో మాట్లాడిన వేళ తాను చూశానని, తనకు జగన్ లో వైఎస్ స్పష్టంగా కనిపించారని అన్నారు. మనసులోని మాటను బయటకు చెప్పేసే వైఎస్ నైజమే జగన్ లో కనిపించిందని ఉండవల్లి తెలిపారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పడం, పారదర్శకతను పెంచుతానని అనడం, జగన్ లోని పట్టుదలకు సంకేతమని అభిప్రాయపడ్డారు.

Prev ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
Next జగన్ సర్కారుకు చిల్లిగవ్వ కూడా అప్పు పుట్టదు: యనమల
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.