జగన్ తో కెసిఆర్ భేటీ..

జగన్ తో కెసిఆర్ భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి చేరుకున్నారు. కుమారుడు కేటీఆర్, ఇతర నేతలతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి తెలంగాణ సీఎం వచ్చారు. ఆయనకు జగన్, ఇతర వైసీపీ నేతలు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ కు కేసీఆర్ శాలువా కప్పి గౌరవించారు.

ఈ సందర్భంగా జగన్ తో సమావేశమైన కేసీఆర్ ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఏపీ సీఎంను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరు అవుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, కేసీఆర్ ఆహ్వానంపై ఏపీ సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని వైసీపీ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ సందర్భంగా కొందరు వేదపండితులు కేసీఆర్ ను ఆశీర్వదించారు.

ఇద్దరు ముఖ్యమంత్రులూ పలు సమస్యలపై చర్చించనున్నారు విభజన చట్టంలో పరిష్కారానికి నోచుకోని అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ప్రభుత్వ రంగ సంస్థల విభజన, విద్యుత్‌ ఉద్యోగులు పంపకాలు, విద్యుత్‌ బిల్లుల బకాయిలు తదితర అంశాలపై ఇరువురు సీఎంలు చర్చించే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాల పరిష్కారంపైనా ఈ భేటీలో చర్చించనున్నారు.

more updates »