జనసేన, బీఎస్పీ పొత్తు..పవన్ సీఎం కావాలన్న మాయావతి

Article

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికల పొత్తు కట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పోటీ చేయాలని నిర్ణయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరప్రదేశ్ వెళ్లారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికలపై చర్చించారు. రెండు పార్టీలు కలసి ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై సమాలోచన చేశారు. సీట్ల పంపకాలు కూడా దాదాపు పూర్తయ్యాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో జనసేన, బీఎస్పీ కలసి పోటీ చేస్తాయని ఆమె ప్రకటించారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ను చూడాలని అనుకుంటున్నా. త్వరలో ఏపీలో ప్రచారాన్ని ప్రారంభిస్తా. సీట్ల పంపకం కూడా దాదాపు పూర్తయింది’ అని మాయావతి అన్నారు. బీఎస్పీతో పొత్తుపెట్టుకోవడం ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘బెహన్ జీ మాయావతిని ప్రధానమంత్రిగా చూడాలనేది మా కోరిక.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ కలసి పోటీ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో ఎక్కువగా బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం గురించి మాట్లాడుతూ ఉంటారు. కాన్షీరాం తనకు ఆదర్శమని, ఎలాంటి ప్రచార సాధనాల (టీవీ, పత్రికలు) అవసరం లేకుండానే పార్టీని నిర్మించి చూపించారని చెబుతుంటారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఓసారి యూపీ వెళ్లి మాయావతిని కలిశారు

Prev వివేకానందరెడ్డిది సహజమరణం కాదు.. వైఎస్ అవినాష్ సంచలన వ్యాఖ్యలు
Next భర్త, కుమారుడిని హత్యచేసిన మహిళ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.