జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నా మాజీ ఎమ్మెల్యే..

Article

జనసేన పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి... కాసేపటి క్రితమే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమ‌తి.. విశాఖప‌ట్నం మాజీ శాస‌న‌స‌భ్యురాలైన అల్లు భానుమ‌తి... జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. విజ‌య‌వాడ‌లోని జ‌న‌సేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంలో అల్లు భానుమతికి కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కల్యాణ్. 1985లో విశాఖ‌-1 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి భానుమ‌తి శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. భనుమతితో పాటు ఆమె మ‌నుమ‌డు య‌ర్రా ర‌ఘురాజ్‌, విశాఖ న‌గ‌ర మాజీ కార్పొరేట‌ర్ య‌ర్రా స‌న్యాసినాయుడు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

Prev బిజెపి నేతలను హెచ్చరించిన చంద్రబాబు
Next రైలు ఢీకొని.. రెండు ఏనుగులు మృతి
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.