హైదరాబాద్‌లో కాజోల్‌ సందడి

హైదరాబాద్‌లో కాజోల్‌ సందడి

హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ సందడి చేశారు. కాప్రా సర్కిల్‌ ఏఎస్‌ రావు నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జోయాలుక్కాస్ ఆభరణాల షోరూంను ఆమె బుధవారం జ్యోతి వెలిగించి ఘనంగా ప్రారంభించారు. కాజోల్‌ను చూడటానికి ఆమె అభిమానులు ఎండను సైతం లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో చేరుకుని కాజోల్‌ను చూసి ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.

ఈ సందర్భంగా కాజోల్ మాట్లాడుతూ జోయాలుక్కాస్ కొత్త షోరూంను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆభరణాల ప్రేమికుల్ని, నా అభిమానుల్ని కలుసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. జోయాలుక్కాస్ ద్వారా ఈ ఆత్మీయ కలయిక గొప్ప మధురానుభూతినిచ్చిందని కాజోల్ తెలిపారు. ప్రారంభోత్సవ సందర్భంగా ఆభరణాలు కొనుగోలు చేసిన ప్రతి వినియోగదారుడికీ కచ్చితమైన ఉచిత బహుమతి అందించనున్నట్టు జోయాలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్‌ అండ్ ఎండీ జోయ్ అలుక్కాస్ తెలిపారు.

more updates »