కమలహాసన్‌ వ్యాఖ్యలపై తమిళనాడు పోలీసుల కేసు నమోదు

కమలహాసన్‌ వ్యాఖ్యలపై తమిళనాడు పోలీసుల కేసు నమోదు

స్వతంత్ర భారత దేశంలో తొలి ఉగ్రవాది ఒక హిందువు అని సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కమల్‌ ప్రజల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కరూర్‌ జిల్లా పోలీసులు తెలిపారు.

తమిళనాడులోని అరవకురిచ్చిలో ఈనెల 12న జరిగిన ఎన్నికల ప్రచార సభలో కమల్‌ మాట్లాడుతూ స్వతంత్ర భారత్‌లో తొలి ఉగ్రవాది హిందువని, అతను నాథూరాంగాడ్సే అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. కమల్‌ వ్యాఖ్యలను బీజేపీ, అన్నాడీఎంకే తీవ్రంగా ఖండించగా, డీఎంకే, కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు ఆయనకు మద్దతుగా నిలిచారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన కమల్‌ పార్టీ ఎంఎన్‌ఎం గుర్తింపు రద్దు చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఇదే విషయంపై ఢిల్లీ కోర్టులో కూడా కమల్ కు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయి.

more updates »