‘రైతుబంధు’ సర్వరోగ నివారిణి కాదు: కిషన్ రెడ్డి

Article

తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న రైతుబంధు పథకం సర్వరోగ నివారిణి కాదని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పంట బీమా పథకాన్ని కొనసాగించాలని ఆయన చెప్పారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో రైతు బంధు పథకంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంట బీమా పథకం కూడా వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే వరకూ రైతులు ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వానకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల వివరాలు సేకరించి వారిని ఆదుకోవాలని కోరుతూ గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శికి ఓ వినతిపత్రం సమర్పించనున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వానికి జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలపై ఉన్న శ్రద్ధ పంట నష్టపోయిన రైతుల మీద లేదని ఎద్దేవా చేశారు.

Prev ఉప్పల్ స్టేడియంలో మద్యం మత్తులో యువతీయువకుల అసభ్య ప్రవర్తన
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.