ప్రియుణ్ని కొట్టి యువతిపై గ్యాంగ్ రేప్...

Article

ఏపీ రాజధాని అమరావతిలో ఘోరం జరిగింది. ప్రేమజంటపై దాడి చేసిన నలుగురు దుండగులు యువతిపై కీచకపర్వానికి తెగబడ్డారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర రక్తస్రావమైన అమ్మాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. తన ప్రియురాలిపై అఘాయిత్యాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన యువకుణ్ని కూడా యువకులు తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అమరావతికి కూతవేటు దూరంలో నవులూరు స్టేడియం సమీపంలో సోమవారం (ఫిబ్రవరి 11) రాత్రి 9 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రేమ జంటను మంగళగిరి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి మరణించగా.. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమికులను గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన జ్యోతి, శ్రీనివాస్‌గా గుర్తించారు.

ప్రేమికులు ఉన్న ప్రదేశంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం ప్రతికూలంగా మారింది. అయితే.. ఘటనా స్థలం నుంచి పోలీసులు కొన్ని కీలక ఆధారాలను సేకరించినట్టు సమాచారం. నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అమరావతికి కూతవేటు దూరంలో జరిగిన ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఘటనపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తమపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని యువకుడు చెప్తున్నాడని.. గాయాల వల్ల సరైన వివరాలు చెప్పలేకపోతున్నాడని పోలీసులు తెలిపారు.

గుంటూరులోని నవులూరు స్టేడియం సమీపంలో ఈ దారుణం జరిగింది. మొదట ప్రియుడిపై దాడి చేసిన దుండగులు యువతిని పక్కకు లాక్కెళ్లి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. యువకుడగికి తీవ్ర గాయాలు కావడంతో.. అతడు కదల్లేని స్థితిలో ఉండిపోయినట్లు సమాచారం. దీంతో కళ్లెదుటే ప్రియురాలిపై అఘాయిత్యం జరుగుతున్నా.. అతడు కాపాడలేకపోయాడు. ఘటన అనంతరం దుండగుటు అక్కడి నుంచి పరారయ్యారు దుండగులు. యువతీయువకుడు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Prev వైరల్ అవుతున్న నాగబాబు సైకిల్ స్కిట్
Next ఉగ్రవాదుల చర్య అత్యంత హేయమైంది: సీఎం కేసీఆర్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.