ఏపీలో ఉదయం ఐదున్నరకే ప్రారంభమైన మాక్ పోలింగ్

Article
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ ఉదయం ఐదున్నర గంటలకే మాక్ పోలింగ్ ప్రారంభించారు. అన్ని పార్టీల ఏజెంట్లతో ఈ మాక్‌పోలింగ్‌ నిర్వహించారు. అనంతరం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,120 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ద్వివేదీ తెలిపారు. అలాగే, 28 వేల కేంద్రాల వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఇక, కృష్ణా జిల్లాలోని మూడు నియోజకవర్గాలు విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమ, మైలవరం నియోజకవర్గాల్లో రెండేసి ఈవీఎంలు ఉపయోగించనున్నారు. ఇక్కడ 15 మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది.
Prev సీఈవో బ్లాక్‌ ఎదుట చంద్రబాబు ధర్నా
Next లైవ్ లో ప్రియుడి చెంప చెల్లు మనిపించిన ప్రియురాలు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.