మారుతీ సుజుకీ ఈరోజు నుండి కారు ధరలు పెంపు

Article

దిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ బుధవారం కార్ల ధరల పెంపుపై ప్రకటన చేసింది. కొన్ని మోడల్‌ కార్ల ధరలు రూ.10 వేల దాకా పెంచుతున్నట్లు వెల్లడించింది. పెరిగిన ధరలు ఈరోజు నుంచే అమలవుతాయని తెలిపింది. ముడి సరకు, విదేశీ మారకం రేట్లు పెరిగిన కారణంగా ధరలు పెంచాల్సి వచ్చినట్లు వెల్లడించింది. జనవరి 10 నుంచి ధరలు అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది.

అయితే, ఏయే మోడల్ కార్లపై ధరలు పెరుగుతాయనేది మారుతీ వెల్లడించలేదు. ప్రస్తుతం మారుతీ సుజుకీ కార్ల మోడళ్లు ఆల్టో 800 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆల్టో 800 నుంచి ప్రీమియం ఎస్‌-క్రాస్‌ మోడల్స్‌ ధరలు రూ.2.53 లక్షల నుంచి రూ.11.45 లక్షల (ఎక్స్‌-షోరూం దిల్లీ) దాకా ఉన్నాయి.

Prev కారులో చెలరేగిన మంటలు..ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్
Next పైసా ఖర్చు లేకుండా వైద్యఖర్చులు భరిస్తాం.. చంద్రబాబు హామీ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.