ఏపీ Sun రైజ్ కాదు.. చంద్రబాబు Son రైజ్: మోదీ విమర్శలు

Article

రాష్ట్రాన్ని సన్‌రైజ్ స్టేట్‌గా తీర్చిదిద్దుతామని చెబుతున్న చంద్రబాబు తన పుత్రుడిని(లోకేశ్) రైజ్ చేసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. గుంటూరు సభలో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌పై నేరుగా విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓడితాననే భయం పట్టుకుందని... అందుకే తన కుమారుడిని ఎలాగైనా రాజకీయాల్లో సెటిల్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

తాను చేసిన తప్పులను కేంద్రంపై నెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మోదీ విమర్శించారు. ఓ పక్క ఓటమి భయం, రాజకీయాల్లో కుమారుడి భవిష్యత్తు, దోచుకున్న ప్రజాధనాన్ని ఎలా దాచుకోవాలన్న భయాలతో చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్నో పథకాలకు కేంద్రం ఇస్తున్న నిధులకు ఇతర కార్యక్రమాలకు ఖర్చు పెట్టేసి నిధులివ్వడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తామిచ్చిన ప్రతి పైసాకు లెక్కలు అడుగుతున్నందునే చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశారని తెలిపారు. 55నెలలుగా ఏపీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామని మోదీ స్పష్టం చేశారు.

Prev ఢిల్లీలో దారుణం.. పదేళ్ల బాలికపై స్వీపర్ లైంగికదాడి
Next ఇంటర్‌ బోర్డు ఎదుట రేవంత్‌, సంపత్‌ల ధర్నా, అరెస్టు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.