చంద్రబాబునాయుడికి జగన్,మోదీ శుభాకాంక్షలు

Article
ఏపి ముఖ్య‌మంత్రి చంద్రబాబు 69వ ఏట అడుగు పెట్టారు. ఎన్నిక‌లు పూర్తి చేసుకొని..ఇత‌ర ప్రాంతాల్లో మిత్ర‌ప‌క్షాల త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్న ముఖ్య‌మంత్రికి పార్టీ నేత‌లు విషెస్ చెబుతున్నారు. ప్ర‌ధాని మోదీ..వైసిపి అధినేత జ‌గ‌న్ సైతం ట్విట్ట‌ర్ ద్వారా చంద్రబాబుకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. చంద్ర‌బాబు సైతం తిరుప‌తి వేదిక‌గా సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. మోదీ..జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు.. ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కు ప్ర‌ధాని మోదీ..వైసిపి అధినేత జ‌గ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. కొంత కాలంగా చంద్ర‌బాబు వ‌ర్సెస్ మోదీ...చంద్ర‌బాబు వ‌ర్సెస్ జ‌గ‌న్ అన్న‌ట్లుగా రాజ‌కీయంగా నేత‌లు వేడి పుట్టించారు. అయితే, రాజ‌కీయాలు వ్య‌క్తిగ‌త సంబంధాల పైన ప్ర‌భావం చూప‌వ‌నే విధంగా చంద్ర‌బాబు జ‌న్మ‌దినాన మోదీ..జ‌గ‌న్ ఇద్ద‌రూ శుభాకాంక్ష‌లు చెప్పారు. చంద్ర‌బాబు ఆయురారోగ్యాల‌తో నిండు నూరేళ్లు జీవించాల‌ని ప్రార్ధిస్తున్నా అంటూ ప్ర‌ధాని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో బాబుకు విషెస్ చెప్పారు. అదే విధంగా వైసిపి అధినేత జ‌గ‌న్ సైతం త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అని ట్వీట్ చేసారు. ఇద్ద‌రు నేత‌ల‌ను చంద్ర‌బాబు కృత‌జ్ఞ‌తలు తెలిపారు.
Prev ఉత్తరప్రదేశ్‌లో పట్టాలు తప్పిన పూర్వ ఎక్స్‌ప్రెస్
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.