మోదీ మాటలను వ్యతిరేకిస్తున్న నెటిజెన్లు

మోదీ మాటలను వ్యతిరేకిస్తున్న నెటిజెన్లు

మోదీని బుధవారం బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యే వరకు తన దుస్తులు తానే ఉతుక్కున్నానని మోదీ అన్నారు. దీనిపై నెటిజెన్లు విపరీతంగా మండిపడుతున్నారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అబద్ధాలు చెప్పడమేంటని, ఇదంతా ఎన్నికల గిమిక్కని విమర్శలు గుప్పిస్తున్నారు.మోదీ అబద్ధాలు చెబుతున్నారని కొన్ని సాక్ష్యాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

మోదీ.. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. అయితే 1970ల్లో.. నరేంద్రమోదీ ఆర్‌ఎస్ఎస్ ప్రచారక్‌గా ఉన్నప్పటి నుంచే చాంద్ మహ్మద్ అనే వ్యక్తి మోదీ దుస్తులు ఉతుకుతూ వచ్చారు. అతడు 2017 అక్టోబర్‌లో మరణించారు. అంటే మోదీ ముఖ్యమంత్రి కాకముందు మూడు దశాబ్దాల క్రితం నుంచే ఆయన దుస్తులు వేరే వారు ఉతికేవారనే విషయం స్పష్టమవుతోందని నెటిజెన్లు మండిపడుతున్నారు.


more updates »