బాలయ్య, క్రిష్‌ను సత్కరించిన సీఎం చంద్రబాబు

Article

అమరావతి: ‘ఎన్టీఆర్’ చిత్ర కథనాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడిని ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించారు. శుక్రవారం ఉదయం ఉండవల్లిలో సీఎం చంద్రబాబును నటుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎన్టీఆర్ పాత్రను అద్భుతంగా నటించారని బాలకృష్ణను ప్రశంసించారు. అలాగే ఎన్టీఆర్ జీవితాన్ని, త్యాగాన్ని, కార్యదక్షతను ప్రజలకు అర్థమయ్యేలా చిత్రరూపమిచ్చారంటూ దర్శకుడు క్రిష్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు.

Prev జనసేన పార్టీతో కలిసి వామపక్షాలు పోటీ చేస్తాయి: మధు
Next పైసా ఖర్చు లేకుండా వైద్యఖర్చులు భరిస్తాం.. చంద్రబాబు హామీ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.