పొరపాట్లు కంటే అపోహలే ఎక్కువ: జగదీశ్‌రెడ్డి

Article

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఫలితాల్లో జరిగిన పొరపాట్లు కంటే అపోహలే ఎక్కువ ఉన్నాయని ఆయన మండిపడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని కోరారు. ఫలితాలపై విచారణ కొనసాగుతోందన్న మంత్రి.. రెండు, మూడు రోజుల్లో నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

సాంకేతిక సమస్య ఉంటే సంబంధిత గ్లోబల్‌ ఎరీనా సంస్థపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక వేళ మానవ తప్పిదమని తేలితే ఆయా వ్యక్తులపై కఠిన చర్యలకు వెనకాడబోమని తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఫలితాలపై అనుమానం ఉన్నవారు తిరిగి లెక్కింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Prev ఇంటర్‌ ఫలితాలపై హైకోర్టులో పిటిషన్‌
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.