ముగిసిన జగన్-కేసీఆర్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

ముగిసిన జగన్-కేసీఆర్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ల భేటీ ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్, కేసీఆర్ ల భేటీ జరిగింది. విభజన అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు గంటన్నరపాటు చర్చించినట్టు సమాచారం. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై, రెండు రాష్ట్రాల మద్య ఉన్న నీటి వివాదాల పరిష్కారంపై, విద్యుత్ ఉద్యోగులు పంపకాలు, విద్యుత్ బిల్లుల బకాయిలపై 9,10 షెడ్యూల్స్ లోని ప్రభుత్వ రంగ సంస్థల విభజన అంశాలపై చర్చించినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతకముందు అమరావతి పరిధిలోని తాడేపల్లిలో తన నివాసానికి విచ్చేసిన కేసీఆర్‌, కేటీఆర్ సహా తెరాస ముఖ్య నేతలకు సీఎం జగన్‌ సాదర స్వాగతం పలికారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని కేసీఆర్‌ జగన్‌ను ఆహ్వానించారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు మధ్యాహ్న భోజనం ఆరగించారు. ఆ తర్వాత జరిగిన కీలక భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ఆస్తుల పంపకాలు, జల వివాదాలు తదితర ముఖ్య అంశాలపై చర్చించినట్టు సమాచారం.

more updates »