జైలులో ముస్లిం ఖైదీకి అవమానం...తీవ్రంగా స్పందించిన ఒవైసీ

Article

దేశరాజధాని తీహార్ జైలులో దారుణం చోటుచేసుకుంది. నబ్బీర్ అనే ముస్లిం ఖైదీ వీపుపై కొందరు జైలులోని సిబ్బంది ‘ఓం’ అనే బీజాక్షారన్ని ముద్రించారు. ఇదంతా జైలు సూపరింటెండెంట్ రాజేశ్ చౌహాన్ సమక్షంలోనే జరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ముస్లింలను అవమానించడానికి రోజుకొక కొత్త మార్గాన్ని కనిబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒవైసీ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘మమ్మల్ని అవమానించడానికి రోజుకోక కొత్త మార్గాన్ని కనిపెడుతున్నారు. అతన్ని ఓ పశువులాగా భావించి ఓం గుర్తును ముద్రించారు. ఇది చాలా అసాధరణమేకాక ఎంతో అవమానకరం కూడా. మేము మనుషులమే, వస్తువులం కాదు. కావాలనే నబ్బీర్‌ ఒంటి మీద ఈ ప్రత్యేక గుర్తును ముద్రించారు. అంతేతప్ప ఇందుకు మరే బలమైన కారణాలు లేవు’ అని ట్వీట్‌ చేశారు.

Prev పాకిస్థాన్ పై దాడి చేసే దమ్మున్న ప్రధాని దేశానికి అవసరం: ఉద్ధవ్ థాకరే
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.