వైరల్ అవుతున్న నాగబాబు సైకిల్ స్కిట్

వైరల్ అవుతున్న నాగబాబు సైకిల్ స్కిట్

‘ఆరోగ్యం బాగుండాలి అంటే సైకిల్ తొక్కాలి. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్‌నే తొక్కాలి’ అంటూ పొలిటికల్ ఫిలాసఫీతో ‘అంతా నా ఇష్టం’ అంటూ మరో సెటారికల్ వీడియోను వదిలారు నాగబాబు. ఎప్పటిలాగే ఇన్ డైరెక్ట్‌గా టీడీపీని టార్గెట్ చేస్తూ ‘జబర్దస్త్’ తరహాలో స్కిట్ వదిలారు నాగబాబు.

ఇందులో ఇద్దరు పిల్లలు సైకిల్ తొక్కుతూ కనిపించారు. ఒక పిల్లవాడు ఆనందంతో సైకిల్ తొక్కుతుంటే.. ఇంకో పిల్లోడు సైకిల్‌ని కిందేసి ఈడ్చి.. ఈడ్చి తన్నుతున్నాడు. అంతలో నాగబాబు ప్రత్యక్షమై.. ఆనందంగా సైకిల్ తొక్కుతున్న అబ్బాయిని బాబూ.. ఏం చేస్తున్నావ్ అంటే.. ‘సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి మంచిది అని సైకిల్ తొక్కుతున్నా అంకుల్’ అని అంటాడు.. ఇక సైకిల్‌ని కిందేసి తొక్కుతున్న అబ్బాయిని ‘నువ్ ఏం చేస్తున్నావ్ బాబూ’.. అంటే ‘సైకిల్‌ని తొక్కితే ఆంధ్రప్రదేశ్‌కే మంచిదని సైకిల్‌నే తొక్కుతున్నా అంకుల్’ అంటూ పళ్లు బిగబెట్టి సైకిల్‌ని కిందేసి మరీ తొక్కేస్తున్నాడు బుడతడు.

ఫైనల్‌గా నాగబాబు ఫ్రేమ్ ఇన్ అయ్యి.. ‘ఆరోగ్యం బాగుండాలి అంటే సైకిల్ తొక్కాలి. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్‌నే తొక్కాలి’ అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఇందులో వాహనం (సైకిల్) ఏ వ్యక్తికి సంబంధించినది కాదు.. ఒక సైకిల్ కంపెనీకి మేం ఇచ్చిన యాడ్ అంటూ ముందే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు నాగబాబు.

more updates »