నాలుగు సంవత్సరాలలో ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా ?

Article

నాలుగేళ్లపాటు కేంద్ర కెబినెట్ లో టీడీపీ ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల హడావుడి ప్రారంభం కావడంతో కొత్త నాటకానికి తెరలేపారని ఆయన ఆరోపించారు. నాలుగున్నరేళ్లు హోదాపై మాట్లాడకుండా, ఇప్పుడు ధర్మపోరాట దీక్ష అంటూ రావడం చంద్రబాబు పరాకాష్టకు నిదర్శనమని అన్నారు. ఇన్నాళ్లు చీకటి మిత్రులుగా ఉన్న వారితో చంద్రబాబు కలిసి రసవత్తర డ్రామాను నడిపిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ఖజానా నుంచి పదికోట్లు ఖర్చు పెట్టి మరి దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేసినప్పుడు వెకిలి నవ్వులు నవ్విన వారు ఇప్పుడు హోదా కోసం పోరాటాలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు.

Prev ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు దీక్ష
Next ఇంటర్‌ బోర్డు వద్ద ఆందోళన
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.