విజయవాడ చేరుకున్న ప్రధాని మోదీ

విజయవాడ చేరుకున్న ప్రధాని మోదీ

విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ డీజీపీ తదితరులు గన్నవరం విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికారు. అక్కడ నుంచి ప్రధాని మోదీ ప్రత్యేక హెలికాప్టర్‌లో గుంటూరు బయల్దేరి వెళ్లారు.

కాగా ప్రధాని హోదాలో పార్టీ కార్యాక్రమాల్లో పాల్గొనేందుకు నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు రావటం ఇదే తొలిసారి. మరోవైపు పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే గుంటూరు నగర శివారులోని బుడంపాడు జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రధాని పాల్గొంటారు.

more updates »