అక్కా అంటూ లిఫ్ట్‌ ఇస్తానని...నర్సుపై యువకుడు అత్యాచార యత్నం

Article

అక్కా అని ఆప్యాయంగా సంభోదించి, లిఫ్ట్‌ ఇస్తానంటే అతని మనసులోని దుష్ట బుద్ధిని ఆమె గమనించలేకపోయంది. వాహనాన్ని ఎక్కించుకున్న అతను దారి మళ్లించి పొలాల్లోకి తీసుకువెళ్తుంటే అత్యాచారం ఆలోచనలో ఉన్నాడని అనుమానించింది. దుర్భుద్ధిని గుర్తించిన వెంటనే ఆ యువతి వాహనంపై నుంచి దూకి తప్పించుకుంది. ఈ ప్రమాదంలో ఆ యువతికి తీవ్ర గాయాలుకాగా, నిందితుడిని స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు వివరాలివి. క్రిష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్రు గ్రామానికి చెందిన బాధిత యువతి కంకిపాడులోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. బుధవారం రాత్రి డ్యూటీ నిమిత్తం కంకిపాడు వెళ్లేందుకు గ్రామంలో ఆటో కోసం వేచి ఉండగా అదే గ్రామానికి చెందిన చోరగుడి రవీంద్ర ఆమె వద్దకు వచ్చాడు. తాను కూడా కంకిపాడు వెళ్తున్నానని, తన బండి ఎక్కితే డ్రాప్‌ చేస్తానని చెప్పాడు. ముఖ పరిచయం ఉన్న వాడే కదా అని నమ్మి ఆ యువతి అతని బండి ఎక్కింది.

కంకిపాడు లాకుల వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా వాహనం వేగాన్ని పెంచిన అతను గోసాల వైకుంఠపురం వైపు వెళ్లడం ప్రారంభించాడు. దీంతో అనుమానించిన ఆ యువతి వాహనాన్ని ఆపాలని కోరింది. అయినా పట్టించుకోకుండా అతను మరింత వేగంగా పొలాల వైపు వెళ్తుండడంతో ఆమె గట్టిగా కేకలు వేస్తూ ‘బండి ఆపకుంటే దూకేస్తాను’ అంటూ బెదిరించింది. అయినా అతను కేర్‌ చేయక పోవడంతో గట్టిగా కేకలువేస్తూ వాహనంపై నుంచి దూకేసింది. ఆమె కేకలు విని చుట్టుపక్కల పనుల్లో ఉన్న వారు వచ్చి తీవ్రంగా గాయపడిన బాధితురాలిని రక్షించారు.

రవీంద్రను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బాధిత యువతిని ఆసుపత్రికి తరలించారు. కాగా, నిందితుడు రవీంద్ర ఓ ప్రధాన పార్టీలో ముఖ్య కార్యకర్త అని గోసాల, గొడవర్రు గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

Prev ఆత్మహత్య యత్నాన్నీ ‘టిక్‌ టాక్‌’లో అప్‌లోడ్‌ చేసిన వివాహిత
Next పెళ్లికి అంగీకరించలేదని ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.