ఓటుకు నోటు కేసులో నరేందర్ రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం..

ఓటుకు నోటు కేసులో నరేందర్ రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం..

ఓటుకు నోటు కేసులో విచారణకు కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి, ఆయన తనయుడు కీర్తన్ రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. అప్పట్లో వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించేందుకు అప్పటి తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఆఫర్ చేసిన రూ.50లక్షలపై అధికారులు ఆయన్ను ఆరా తీశారు.

కేసుకు సంబంధించి నరేందర్ రెడ్డిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. రూ.50లక్షలతో పాటు మరో నాలుగున్నర కోట్ల ప్రలోభానికి సంబంధించి విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. బ్యాంకు అకౌంట్స్ ముందు పెట్టి మరీ విచారణ జరుపుతున్నట్టు చెబుతున్నారు.

కాగా, 2015లో వెలుగు చూసిన ఓటుకు నోటు ఉదంతంలో వేం నరేందర్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు రేవంత్ రెడ్డి ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్టీఫెన్‌సన్‌ను ప్రలోభ పెట్టారన్న ఆరోపణలున్నాయి. కేసులో ఇప్పటికే ఉదయ సింహ, రేవంత్ రెడ్డిలను విచారించిన ఈడీ.. ఇప్పుడు నరేందర్ రెడ్డిని విచారిస్తోంది.

more updates »