ఆర్టికల్‌ 370 రద్దుతో పటేల్‌ ఆశయం నెరవేరింది

ఆర్టికల్‌ 370 రద్దుతో పటేల్‌ ఆశయం నెరవేరింది

హైదరాబాద్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ఐపిఎస్‌ ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ లో శిక్షణ పూర్తి చేసుకున్న 92 మంది ఐపిఎస్‌ లు పాల్గొన్నా‌రు.. కేంద్ర మంత్రి అమిత్‌ షా ముందుగా ఐపిఎస్‌ ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అమిత్‌ షా మాట్లాడుతూ.. ఐపిఎస్‌ సాధించడంతోనే ఆశయం నెరవేరినట్లు కాదని, నిజాయితీగా పని చేసి దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌ లో విలీనం చేసేందుకు సర్థార్‌ వల్లభారు పటేల ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆర్టికల్‌ 370 రద్దుతో పటేల్‌ ఆశయం నెరవేరిందన్నారు. లక్ష్య సాధన నేటి నుండి మొదలైందన్నారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ఐపిఎస్‌ అవ్వగానే లక్ష్యం పూర్తవ్వదని, నేటి నుండి సవాళ్లను ఎదుర్కోవాలని చెప్పారు. దేశ రక్షణ కోసం ఎంతో మంది పోలీసులు ప్రాణాలు ఇచ్చారని తెలిపారు. పటేల్‌ పోలీస్‌ వ్యవస్థను పటిష్టం చేశారన్నారు. అరాచకాల నుండి పటేల్‌ విముక్తి కల్పించారని అమిత్‌ షా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్‌ షా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ, ఇతర అధికారులు పాల్గొన్నా‌రు.

more updates »