జనసేన మానిఫెస్టోని ప్రకటించిన పవన్ కళ్యాణ్

Article

జనసేన అదికారంలోకి వస్తే రైతులకు ఎకరాకు ఎనిమిది వేల రూపాయలు ఇస్తామని ఆ పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బడ్జెట్ అనుమతిస్తే పదివేల రూపాయల వరకు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని ఆయన అన్నారు.వయసు మీరిన రైతు కూలీలకు పెన్షన్ గా ఐదు వేల రూపాయలు ఇవ్వాలని భావిస్తున్నామని ఆయన అన్నారు. భూములు కోల్పోయే రైతులకు 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం ఇస్తామని ఆయన అన్నారు.రైతే రాజు అంటూ రైతులు భూములు కోల్పోయి పరిశ్రమలు పెడితే అందులో వారిని భాగస్వాములు చేయాలన్నది తమ మానిఫెస్టోలో భాగమని ఆయన అన్నారు.రైతు కన్నీరు దేశానికి మంచిది కాదని ఆయన అన్నారు.ఉభయ గోదావరి జిల్లాలలో గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేసి, ఇక్కడ పండేఉత్పత్తులను అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తామని ఆయన అన్నారు.ప్రతి రైతుకు ఉచితంగా సోలార్ మోటార్లు ఇవ్వాలని నిర్ణయిమచామని ఆయన అన్నారు .వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఉత్తరాంద్రలో నదుల అనుసంధానం చేస్తామని ఆయన అన్నారు.జనసేన ఎన్నికల మానిఫెస్టోని ఆయన ఈ సభలో తెలిపారు.ఒకటో తరగతి నుంచి పిజి వరకు ఉచిత విద్య ఇస్తామని ఆయన అన్నారు.కాలేజీలకు వెళ్లడానికి ఉచిత రవాణా ఏర్పాటు చస్తామని ఆయన అన్నారు. డొక్కా సీతమ్మ క్యాంటిన్లు ఏర్పాటు చస్తామని ఆయన అన్నారు.

Prev రేపటి నుంచి ఒంటిపూట బడులు..
Next ఇవియం ల గొడవ వెనుక అసలు మతలబు ఏమిటి?
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.