నందమూరి తారక రామారావుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Article

2019 సార్వత్రిక ఎన్నికల కోసం పవన్‌కల్యాణ్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆయన.. పార్టీ మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఇటీవలే ప్రకటించారు. వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు.

అయితే తన ప్రచారంలో తెలుగు సినిమా దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్టీఆర్ చేసిన ఓ వ్యాఖను ప్రస్తావిస్తూ.. ఎన్టీఆర్‌లా తాను అహంకారాన్ని తలకెక్కించుకోనని పవన్ చెప్పకనే చెప్పారు.

‘‘ఎన్టీఆర్‌గారు మెదక్ లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని మాట్లాడారు, ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు, నా వెనుక లక్షలాది మంది జనసైనికులు ధవళేశ్వరం అయినా, అనంతపురంలో అయినా వచ్చారని నేను తలకి ఎక్కించుకోను’’ అని పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను జనసేన పార్టీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ తన పార్టీ గురించి, తన గురించి ప్రచారం చేసుకోవాలి.. అంతేకాని తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడిని ఉద్ధేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిమానులు మండిపడుతున్నారు.

Prev కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో గవర్నర్ సమావేశం
Next పైసా ఖర్చు లేకుండా వైద్యఖర్చులు భరిస్తాం.. చంద్రబాబు హామీ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.