నాకు కులం లేదు: పవన్‌కల్యాణ్

Article
రాజమండ్రి: తాను కాపుకులానికి చెందిన వాడినని అందరూ అంటున్నారని, అయితే తనకు కులం లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. కులాలను కలిపేది జనసేన అని, విడదీసేది కాదని పేర్కొన్నారు. గురువారం సాయంత్రం రాజమండ్రిలో జరిగిన పార్టీ ఐదో ఆవిర్భావసభలో పవన్‌కల్యాణ్ ఉద్వేగంగా ప్రసంగించారు. 2014లో ఏమీ ఆశించకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. తాను సీఎం కుమారుడిని కాదని, ఓ సాదాసీదా కానిస్టేబుల్ కుమారుణ్ణి అన్నారు. పవన్ బలం గోదావరి జిల్లాల్లోనే అని కొందరు అంటున్నారని, అది తప్పని నిరూపిస్తానని చెప్పారు. సీమలోనూ బలం ఉందని తొడగొట్టి చెప్పాలా? అని ప్రశ్నించారు. జనం కోరితే తెలంగాణలోనూ రాజకీయాలు చేస్తానని తెలిపారు. తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొందరు నీచంగా చూశారని, ఏపీలో రాజకీయం రెండు కులాల మధ్యే ఊగిసలాడుతున్నదని ఆరోపించారు.
Prev తొలి జాబితాను విడుదల చేసిన చంద్రబాబు
Next ఇవియం ల గొడవ వెనుక అసలు మతలబు ఏమిటి?
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.