జనసేన ఆఫీసుల మూసివేతల‌పై స్పందించిన పవన్ కల్యాణ్

Article
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ లో చాలాచోట్ల జనసేన ఆఫీసులు మూసివేస్తున్నట్లు ఇటీవల పలు ఫొటోలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన శ్రేణుల్లో గందరగోళం నెలకొడంతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. నియోజకవర్గాల్లోని జనసేన కార్యాలయాలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేననీ, జనసేన శ్రేణులంతా సమాజంలో మంచి మార్పు రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
Prev వయనాడ్‌లో ఈవిఎంల మొరాయింపు
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.