పవన్ ముందుగా ఆ విషయంపై క్లారిటీ ఇవ్వాలి!: కవిత డిమాండ్

Article

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని లోక్ సభ స్థానాల్లో కలిసి పోటీచేస్తామని జనసేన, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి పొత్తు కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో జనసేన-బీఎస్పీ పొత్తుపై టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు.

ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో బీఎస్పీ-జనసేన పొత్తు పెట్టుకోవడం రాజకీయ గిమ్మిక్కేనని కవిత స్పష్టం చేశారు. వీరిద్దరూ ఏపీలో చంద్రబాబుతో కలిసి ఎన్నికలకు వెళతారా? లేక స్వతంత్రంగా పోటీచేస్తారా? అన్న విషయమై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్, మాయావతి ప్రజలకు జవాబు చెప్పాలన్నారు.

Prev వైఎస్ వివేకానంద రెడ్డి పోస్ట్‌మార్టం పూర్తి..
Next భర్త, కుమారుడిని హత్యచేసిన మహిళ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.