సోషల్‌మీడియా వార్తలపై స్పందించిన పవన్‌

సోషల్‌మీడియా వార్తలపై స్పందించిన పవన్‌
మంగళగిరి: జనసేన పార్టీ దుకాణం బంద్‌ అయ్యిందని..ఆపార్టీ కార్యాలయాల ముందు టు-లెట్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయని సోషల్‌ మీడియాలో వైఎస్‌ఆర్‌సిపి విస్తృత ప్రచారం చేస్తుంది. దీంతో కొన్ని ఛానళ్లు కూడా జనసేనపార్టీ ఆఫీసులు మూసేస్తున్నారంటూ ప్రచారం చేశాయి. ఈ ప్రచారంపై ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పార్టీ అభ్యర్ధులతో మాట్లాడారు. నియోజకవర్గాల్లో జనసేన కార్యాలయాలు యధావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, సమాజంలో మంచి మార్పు రావాలనే ఉద్దేశంతో ముందుకు సాగాలని పవన్‌ పార్టీ అభ్యర్ధులకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి, వారిని కలుసుకుని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పవన్‌ పార్టీ అభ్యర్ధులకు సూచించారు.
more updates »