పేటీఎం మొబైల్ బ్యాంకింగ్ యాప్ విడుదల

Article

ముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన ఖాతాదారుల కోసం సరికొత్త మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా దాదాపు 4.3 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుతుందని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ పేటీఎం పేమెంట్ ఖాతాలో ఎంత నగదు ఉందని సులభంగా తెలుసుకోవచ్చు. యాప్‌ను ఉపయోగించి డెబిట్, క్రెడిట్‌ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని కూడా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సేవలు వారంలో ఏడు రోజుల పాటు అందుబాటులో ఉంటాయని ప్రకటన పేర్కొంది. 2017 మేలో ప్రారంభమైన తమ బ్యాంక్‌లో ప్రస్తుతం 4.3 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నట్లు ఇందులో ఉన్నట్టు పేర్కొంది.
Prev వైఎస్‌ వివేకానంద రెడ్డిది హత్యే: పోలీసులు
Next భర్త, కుమారుడిని హత్యచేసిన మహిళ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.