అట‌ల్‌జీ విదిషా నుంచి మోదీ పోటీ

Article
మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి పోటీ చేసి గెలిచిన విదిషా లోక్‌స‌భ స్థానం నుంచి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పోటీ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని విదిషా నియోజ‌క‌వ‌ర్గం నుంచి మోదీ పోటీ చేయాల‌ని ఆ రాష్ట్ర మంత్రి రాఘ‌వ్ జీ భాయ్ ప్ర‌ధానిని కోరిన‌ట్లు తెలుస్తున్న‌ది. 1991లో ల‌క్నోతో పాటు విదిషా నుంచి కూడా అట‌ల్‌జీ పోటీ చేసి గెలిచారు. ఆ త‌ర్వాత విదిషా స్థానం నుంచి వాజ్‌పేయి రాజీనామా చేశారు. వాజ్‌పేయి త‌ర్వాత ఈ స్థానం నుంచి ఆ రాష్ట్ర మాజీ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ అయిదు సార్లు గెలిచారు. గ‌త‌ రెండు ప‌ర్యాయాల నుంచి ఈ స్థానం నుంచి సుష్మా స్వ‌రాజ్ గెలుపొందారు. విదిషా నుంచి మోదీ పోటీ చేస్తే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌లో బీజేపీ గెలుపు ఆశ‌లు చిగురిస్తాయ‌ని రాఘవ్‌జీ అన్నారు. 2014లో విదిషా నుంచి బీజేపీ అభ్య‌ర్థి సుమారు 4 ల‌క్ష‌ల మెజారిటీ ఓట్ల‌తో నెగ్గారు. ప్ర‌ధాని మోదీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌, ఇండోర్‌, విదిషా స్థానాలకు ఇప్ప‌టి వ‌ర‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేదు. దీంతో విదిషా నుంచి మోదీ పోటీ చేస్తార‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Prev ఏపీలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు పోలింగ్
Next మద్యం మత్తులో అధికారులు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.