రాహుల్ గాంధీ మరో సంచలన నిర్ణయం

Article

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను నియమించారు. షీలా నేతృత్వంలో పార్టీ మరింత పటిష్టమౌతుందని డీపీసీసీ మాజీ చీఫ్ అజయ్ మాకెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్, మోదీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షంగా తయారౌతామని చెప్పారు. షీలా నుంచి నాయకత్వ బాధ్యతలు మారాక ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ డీలా పడింది. కేజ్రీవాల్‌ను ఢీ కొట్టగలిగే సత్తా ఉన్న నాయకులే కరువయ్యారు. ఆప్ సునామీ తరహా విజయాన్ని నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేకుండా పోయింది. ఢిల్లీ అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. మళ్లీ ఇప్పుడు పార్టీని పటిష్టం చేసే దిశగా షీలా దీక్షిత్‌ను ఎంపిక చేశారు.

Prev నందమూరి తారక రామారావుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Next పైసా ఖర్చు లేకుండా వైద్యఖర్చులు భరిస్తాం.. చంద్రబాబు హామీ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.