చంద్రబాబు అందుకే దారుణంగా ఓడిపోయారు: రామ్ గోపాల్ వర్మ

Article

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయదుందుభి మోగించగా, టీడీపీ 23 స్థానాలకు పరిమితమై ఘోర పరాభవాన్ని ముటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ ఓటమిపై వ్యంగ్యంగా స్పందించారు.

తన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ఆపేసినందుకే చంద్రబాబు దారుణంగా ఓడిపోయారని రామ్ గోపాల్ వర్మ విమర్శించారు. ఈ విషయాన్ని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ నిన్న రాత్రి తన కలలోకి వచ్చి చెప్పారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

Prev ఏపీలో అత్యధిక, అత్యల్ప మెజారిటీలు
Next జగన్ సర్కారుకు చిల్లిగవ్వ కూడా అప్పు పుట్టదు: యనమల
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.